'లైగర్' కి నేనెందుకు వర్క్ చేయలేదంటే...
on Nov 23, 2022
'ఆలీతో సరదాగా' టాక్ షోకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. మణిశర్మ పేరు చెప్తే చాలు.. ఎన్నెన్నో పాపులర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సంగతి సరే సరి. కాకపొతే ఇప్పుడు కొంచెం ఆయన హవా తగ్గిందనే చెప్పొచ్చు. ఐనా ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' తో మరోసారి తన మ్యూజిక్ పవర్ ఎలాంటిదో తెలియజేశారు.
ఇకపోతే పూరితో కలిసి ఇస్మార్ట్ శంకర్ మూవీ చేసాక ఆయన నెక్స్ట్ మూవీకి కూడా మణిశర్మ వర్క్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇలాంటి సందర్భంలో మణిశర్మ 'లైగర్' సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టారు. అసలు తాను ఈ మూవీ ఎందుకు చేయలేకపోయారో వివరించారు.
"పూరీ జగన్నాథ్‌తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేశారు కదా.. ఆ తర్వాత 'లైగర్' కోసం వద్దనుకున్నారా? తీసుకోలేదా? అని అలీ అడిగేసరికి సమాధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి మణిశర్మ ఆపారు. ఫుల్ ఎపిసోడ్లో మనకు ఆ కారణాలు ఏంటనే విషయం వెల్లడి కావచ్చు. అంత దాకా వెయిట్ చేయాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
